నెట్‌ఫ్లిక్స్‌ పండగ: సినిమాల పండగే!

January 16, 2026


img

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నేడు ‘నెట్‌ఫ్లిక్స్‌ పండుగ’ పేరుతో ఏకంగా 13కి పైగా సినిమాలు ప్రకటించింది. అవన్నీ థియేటర్లలో విడుదలైన తర్వాత సినీ పరిశ్రమ సంస్థలతో ఒప్పందం ప్రకారం వరుసగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతాయని నెట్‌ఫ్లిక్స్‌ పేర్కొంది.   

ఇటీవల విడుదలైన ‘చాంపియన్’ మొదలు ఇక ముందు విడుదల కాబోయే సినిమాలు ఆ జాబితాలో ఉన్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్‌ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రామ్‌ చరణ్‌ ‘పెద్ది’, వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’, నాని ‘ది ప్యారడైజ్’, విజయ్‌ దేవరకొండ ‘వీడీ14’, శర్వానంద్ ‘బైకర్’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’, దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’, రోషన్ ‘ఛాంపియన్’, ‘రూమ్ నం:418’ వంటి అనేక సినిమాలున్నాయి. 

నెట్‌ఫ్లిక్స్‌ ఒకేసారి ఇన్ని సినిమాలు ప్రకటించడం విశేషమే కదా? మరి మిగిలిన ఓటీటీ సంస్థలు కూడా నెట్‌ఫ్లిక్స్‌ పోటీగా ఏయే సినిమాలు ప్రకటిస్తాయో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష