దక్షినాది అగ్ర దర్శకులలో ఒకరైన గుణశేఖర్ సినిమాలకు ప్రత్యేక అభిమానులు చాలా మందే ఉన్నారు. ఆయన ఎంచుకునే కధలు, వాటిని తెరపై ప్రెజంట్ చేసే విధానమే అందుకు కారణం.
గుణశేఖర్ దర్శకత్వంలో ‘ఇఫోరియా’ అనే యాక్షన్ సినిమా సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. ముందే చెప్పుకున్నట్లు ట్రైలర్ గుణశేఖర్ మార్క్ కధ ఉందని హింట్ ఇచ్చేశారు. ఐఏఎస్ అధికారిణి కావాలనుకున్న ఓ యువతీ జీవితం నేపధ్యంలో సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ట్రైలర్‌లో చూపారు. వాటికి యాక్షన్ సన్నివేశాల హంగులద్దారు.
ఈ సినిమాతో హీరో విగ్నేశ్ గవిరెడ్డితో సహా మరో 20 మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నారు. నాజర్, భూమిక చావ్లా, సారా అర్జున్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుణ శేఖర్, సంగీతం: కాల భైరవ్, కెమెరా: ప్రవీణ్ కే పోతన్, డైలాగ్స్: నాగేంద్ర కాశీ, కృష్ణ హరి, ఆర్ట్:శ్రీనివాస్ కళింగ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి చేస్తున్నారు.
గుణా ప్రొడక్షన్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్త గుణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిభ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.