కమిటీ కుర్రోళ్ళు, ద గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమాలలో హీరోయిన్‌గా చేసిన టీనా శ్రావ్య మేడారంలో తన పెంపుడు కుక్కని కాటాలో కూర్చోబెట్టి దాని బరువుకి సరిపడా బెల్లం వనదేవతలకు సమర్పించారు.
ఆ వీడియోని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అది వివాదానికి దారి తీయడం, నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఆమె వెంటనే ఆ వీడియోని డిలీట్ చేశారు. అంతేకాదు అందరికీ బేషరతుగా క్షమాపణలు చెపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేసి ఇక్కడితో దీనిపై చర్చ నిలిపేయాలని అభ్యర్ధించారు.
దానిలో ఆమె ఏమన్నారంటే, తనకు మేడారం సమ్మక్క సారలమ్మలంటే చాలా భక్తి ఉన్నందునే, ఇటీవల ట్యూమర్ సర్జరీ చేయించుకున్న తన పెంపుడు కుక్క ఆరోగ్యం కోలుకోవాలని వనదేవతలకు మొక్కుకున్నానని చెప్పారు.
తన కుక్క పూర్తిగా కోలుకోవడం ఒక్కు తీర్చుకోవాలనుకున్నాను తప్ప అలా చేయడం తప్పని తనకు తెలియదని అన్నారు. తెలియక చేసిన ఈ తప్పు వలన ఎవరైనా బాధపడితే వారికి చేతులు జోడించి నమస్కరించి క్షమాపణలు చెప్పుకుంటున్నాను అని అన్నారు. మళ్ళీ ఇటువంటి తప్పు చేయనని ఇక్కడితో ఈ చర్చ నిలిపివేయాలని టీనా శ్రావ్య చేతులు జోడించి వేడుకున్నారు.
ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే....
video courtesy: Great Andhra)