బిఆర్ఎస్ ఎమ్మెల్సీగా తనకు ఎదురే లేదనుకున్న కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాలలో ఏకాకిగా మారిన తర్వాత తండ్రి కేసీఆర్ ప్రతిష్టకి, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడటం చాలా తప్పని ఇప్పటికీ గ్రహించినట్లున్నారు. అందుకే తండ్రిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసి నేటికీ ఆరేళ్లు పూర్తవడంతో ఆ ప్రాజెక్ట్ గొప్పదనం గురించి వర్ణిస్తూ, దనాయి కోసం తన తండ్రి కేసీఆర్ ఎంతగానో శ్రమించి, ఎన్నో సమస్యలు ఎదుర్కొని పట్టుదలగా కేవలం మూడేళ్ళలో అంత భారీ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేశారని కల్వకుంట్ల కవిత ఎక్స్ సోషల్ మీడియాలో పొగిడారు. అలాంటి అపర భగీరధుడిపైనే కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు వేస్తోందని మండిపడ్డారు. నేటికీ తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే లైఫ్ లైన్ అని నొక్కి చెప్పారు.
ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఆమెని కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదు. బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో కలిపేయడం తప్పు అంటూ తండ్రిని విమర్శించినందున ఆమె వేరే పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి. తెలంగాణ జాగృతిని యాక్టివ్‌గా చేసుకుందామని ఆమె చేసిన ప్రయత్నాలు పఫలించనప్పుడు కొత్తగా పార్టీ పెట్టినా ప్రయోజనం ఉండదని గ్రహించినట్లే ఉన్నారు. కనుక తండ్రి కేసీఆర్‌ని ప్రసన్నం చేసుకునేందుకు ఈవిదంగా కల్వకుంట్ల కవిత చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా? లేకుంటే ఆమె పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభించవచ్చు.

కాళేశ్వర గంగతో తెలంగాణ కాళ్లు కడిగిన రోజు నేడు

నెర్రెలు బారిన తెలంగాణ నేలను కాళేశ్వర గంగతో అభిషేకించిన నిత్యకృషీవలుడు కేసీఆర్ గారు. ఆయన భగీరథ సంకల్పం సాకారమై నేటికి ఆరేండ్లు. సముద్రం వైపునకు పరుగులు పెడుతోన్న గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 530 మీటర్ల ఎగువకు ఎత్తిపోసి మన… pic.twitter.com/YCyQBvdzHQ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 21, 2025