రియాలిటీ నుంచి సంగీత్ ప్రమో సాంగ్

November 27, 2026


img

కిరణ్‌ అబ్బవరం, దేవికా భట్‌ జంటగా చేస్తున్న ‘రియాలిటీ’ నుంచి సంగీత్ ప్రమో సాంగ్‌ విడుదలైంది. 

సురేష్ గంగుల వ్రాసిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా శ్రీకృష్ణ, సాహితీ చాగంటి, కుంచె రఘు తదితరులు హుషారుగా ఆలపించారు. పూర్తిపాట ఈ నెల 29న విడుదలవుతుంది.       

ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడుగా కిరణ్ అబ్బవరం నటించగా శరత్‌ కుమార్‌, సాయికుమార్‌, రమేష్‌ ఇందిర, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: కిరణ్‌ అబ్బవరం, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: విశ్వాస్‌ డేనియల్‌, ఆర్ట్‌: సుధీర్‌ మాచర్ల,  ఎడిటింగ్‌: సంతోష్‌ నాయుడు చేశారు. 

జాయ్‌ ఫిల్మ్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సుధాకర్‌ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల కానుంది. 


Related Post

సినిమా స‌మీక్ష