కీర్తి సురేష్: రైజ్ ఆఫ్ సావిత్రి లిరికల్ సాంగ్‌

November 19, 2026


img

 ప్రవీణ్‌ ఎస్‌.విజయ్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్‌ న్యాయవాదిగా నటించిన కోర్టు డ్రామా సినిమా ‘సత్యవాన్‌ సావిత్రి’ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘రైజ్ ఆఫ్ సావిత్రి’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. 

రామ్‌ శ్రీవాత్సవ వ్రాసిన ఈ పాటకు శామ్‌ సి సంగీతం అందించగా షేన్ బంగారాజ్ గణేష్ లింగం ఆలపించారు.  

‘సత్యవాన్‌ సావిత్రి’లో ప్రముఖ నటుడు, దర్శకుడు మిస్కిన్‌ ఈ సినిమాలో క్రిమినల్ లాయర్‌గా చేశారు. చారుకేశ్‌, శరవణన్‌, శిల్పా మంజునాథ్‌, మధుసూదనన్‌, సుందరరాజన్‌, బ్రిగిడా, మాలా పార్వతి, వెంకటేష్‌ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: శామ్‌ సి, కెమెరా:  అరుణ్ విన్సెంట్, ఆర్ట్: ప్రేమ్‌ కరుణామలై, ఏఎం ఆనంద్ రాజ్, ఎడిటింగ్: ప్రసన్న జీకే చేశారు.   

డ్రమ్‌స్టిక్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వేదిక్కారన్‌పట్టి ఎస్‌. శక్తివేల్‌ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించిన సత్యవాన్ సావిత్రి నవంబర్‌ 20న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష