స్కేరీ పిక్చర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్‌!

November 13, 2026


img

హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన హర్రర్ మూవీ ‘స్కేరీ పిక్చర్’ రాబోతోంది. ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ శుక్రవారం విడుదల చేశారు. 

ఇదొక ‘కొత్త భయంకరమైన పీడ కార్యకర్తలు.. త్వరలో మొదలవబోతోంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానపాత్ర చేస్తున్నారు. 

హారర్ సినిమాలు తీయడంలో మంచి పేరున్న నటుడు, దర్శకుడు రవిబాబు ఈ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. 

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్‌తో కలిసి తమ సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దశాబ్దాలుగా అనేక సినిమాలు నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు ఇదే తొలి హారర్ సినిమా కావడం విశేషం. 

భారత్‌లో ఒక్కో రాష్ట్రం, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన నమ్మకాలు, భయాలు ఉంటాయి కనుక వాటన్నిటి సమాహారంగా హారర్ సినిమాల నిర్మాణానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది తన ఆలోచన అని రానా దగ్గుబాటి తెలిపారు.


Related Post

సినిమా స‌మీక్ష