మనం నివసిస్తున్న ఈ సమాజంలో మనకు తెలియనివెన్నో జరుగుతుంటాయి. అలాగే మనచుట్టూ నివసిస్తున్నవారిలో కొందరి జీవితాలు చాలా ఊహాతీతంగా సాగుతుంటాయి. అటువంటి కథతో తెరకెక్కించిన సినిమాయే ‘పాకెట్ రాకెట్స్’ అని టీజర్‌లో చూపారు.
రుద్ర అత్రి దర్శకత్వం త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శ్రియా కొంతం హీరోయిన్‌గా నటించారు. జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరీటి దామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు సంగీతం: గ్యానీ, సినిమాటోగ్రఫీ: ఎదురోలు రాజు, ఎడిటింగ్: అన్వర్ అలీ చేస్తున్నారు.
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.