ఆదర్శ కుటుంబం కలెక్షన్స్‌ వెరీ గుడ్

November 03, 2026


img

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా అక్టోబర్ 30న విడుదలైన ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నెం. 47) సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. 

ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే భారత్‌లో రూ.36.85 కోట్లు గ్రాస్, (రూ.31.40 కోట్లు నెట్‌) వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సీస్‌లో రూ.14.10 కోట్లు గ్రాస్ వసూళ్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.50.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ సాధించినట్లు సాక్‌నిల్క్ అంచనా వేసింది. 

అయితే, చిత్ర నిర్మాణ సంస్థ మాత్రం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ప్రకటించింది.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి నటించగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష