ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వంలో కోర్టు డ్రామాగా వస్తున్న ‘సత్యవాన్ సావిత్రి’లో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ లాయర్‌గా నటించారు.
ఈ సినిమాలో చారుకేశ్, శరవణన్, శిల్పా మంజునాథ్, మధుసూదనన్, సుందరరాజన్, బ్రిగిడా, మాలా పార్వతి, వెంకటేష్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నటుడు, దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాలో కీలక పాత్ర చేశారు.
ఈ సినిమా జూలై 24న విడుదల చేయాలని ముందు ప్లాన్ చేసుకున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో దీనిని విడుదల చేయకుండానే ఆటకెక్కించేశారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
కానీ నేడు హటాత్తుగా ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘ఇక మౌనం లేదు.. సావిత్రి పోరాటమే’ అనే క్యాప్షన్‌తో విడుదల తేదీని ప్రకటించారు. దీంతో సినిమాపై ఉన్న అనుమానాలు, అపోహలు తొలగిపోయాయి.
డ్రమ్‌స్టిక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేదిక్కారన్‌పట్టి ఎస్. శక్తివేల్ ఈ చిత్రాన్ని తెలుగు తమిళ్ భాషల్లో నిర్మించారు.