తెలుగు, తమిళంలో సూపర్ హిట్ సినిమా అయిన ‘రేణిగుంట’కు సీక్వెల్‌గా ‘రేణిగుంట 2’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ‘ఏకావలి’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.
డా. చల్లా భాగ్యలక్ష్మి వ్రాసిన ‘ఏకావలి’ పాటకు మను రవిచంద్రన్ సంగీతం అందించగా సిద్ శ్రీరామ్ స్వరంలో ఈ పాటకు జీవం పోశారని చెప్పవచ్చు. .
ఆర్.పన్నీర్‌సెల్వం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జానీ, షాలీ నివేకాస్ ప్రధాన పాత్రలు చేశారు.
ఈ చిత్రానికి పాటలు: వివేక, సంగీతం: మనూ రవిచంద్రన్, కెమెరా: ఆర్.బి. గురుదేవ్, ఆర్ట్: లాల్‌గుడి ఎన్. ఇళయరాజా, డాన్స్ కొరియోగ్రఫీ: బృందా, అజర్, యాక్షన్ కొరియోగ్రఫీ: కె. రాజశేఖర్, ఎడిటింగ్: ఆంథోనీ చేస్తున్నారు.
ఏ. పన్నీర్‌సెల్వం ఫిల్మ్ ఫ్యాక్టరీ, కింగ్స్ స్టూడియోస్ బ్యానర్లపై కె.దేవకుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రేణిగుంట-2 రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.