టాక్సిక్‌ ట్రోలింగ్ తబాహీ .. యష్‌ సమాధానం షాకింగ్

August 16, 2026


img

కన్నడ స్టార్ హీరో యష్‌ హీరోగా నటించిన ‘టాక్సిక్‌’ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘తబాహీ’ పాటపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పాటలో యష్‌, కియారా మధ్య ఉన్న బోల్డ్, ఇంటిమేట్ సన్నివేశాలను కొందరు నెటిజన్లు ‘కండోమ్ యాడ్‌’తో పోల్చుతూ ట్రోల్ చేశారు. 

ఈ కామెంట్లపై యష్‌ స్పందిస్తూ, “ఒకవేళ కండోమ్ యాడ్ చేయాల్సి వస్తే తప్పకుండా చేస్తాను. కానీ దానికీ డబ్బులు తీసుకుంటాను. ఉచితంగా మాత్రం చేయన,” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన సమాధానానికి అక్కడున్న ప్రేక్షకులు నవ్వుకున్నారు. 

తబాహీపై మరింత వివరణ ఇస్తూ ‘టాక్సిక్‌’ ప్రత్యేకంగా పెద్దల కోసం ఫెయిరీ టేల్‌గా తీశామని చెప్తూనే ఉన్నాము. తల్లితండ్రులు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చే పిల్లలను ఇంట్లోనే వదిలేయమని కూడా చెప్తున్నాము. అయితే సినిమా పేరు టాక్సిక్ అయినప్పటికీ అలాంటి ప్రత్యేక సన్నివేశాలను కళాత్మకంగా తెరకెక్కించాము. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ నేను ఎవరినీ కనీసం కిస్ కూడా చేయలేదు,” అని యష్‌ చెప్పారు. 

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్‌’ను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. యష్‌ కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Related Post

సినిమా స‌మీక్ష