శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేస్తున్న ‘ఇరుముడి’ నుంచి ‘శరణం అయ్యప్పా.. మల్లెపూల పల్లకి.. “అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.
తండ్రీ కూతుర్ల సెంటిమెంట్‌తో తెరకెక్కించిన ‘ఇరుముడి’లో ఈ పాట కోసమే అయ్యప్ప భక్తులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇది వారి అంచనాలకు తగ్గట్లుగానే సాగినా రవితేజ ‘మాస్ మార్క్’ కూడా స్పష్టంగా కనిపించడం విశేషం.
ఈ సినిమాలో రవితేజ భార్యగా ప్రియ భవానీ శంకర్, వారి కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో బేబీ నక్షత్ర నటనకు ప్రజలు ఫిదా అవుతున్నారు. భావోద్వేగ సన్నివేశాలలో కూడా చాలా అద్భుతంగా నటించింది. చక్కగా డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శివ నిర్వాణ, సంగీతం: జీవి. ప్రకాష్ కుమార్, కోరియోగ్రఫీ: శేఖర్ వీజే, బాబా భాస్కర్, కెమెరా: విష్ణు శర్మ, ఆర్ట్: భార్గవ నౌదండ్ల, స్టంట్స్: రామ్ లక్షణ్, రియల్ సతీష్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ నిర్మిస్తున్న ఇరుముడి ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది.