ప్రముఖ నేపథ్య గాయని కె.జమునా రాణి (88) గురువారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.
జమునా రాణి తెలుగు, తమిళ్. కన్నడ, మళయాళం, సింహళ భాషలతో సహా పలు భాషలలో సుమారు ఆరువేల పాటలు పాడారు. ఆమె 1938లో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. ఏడేళ్ళ వయసులోనే ఆమె త్యాగయ్య (1946) సినిమాలో పాడారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలలో అన్ని భాషలలో కలిపి సుమారు ఆరువేల పాటలు పాడారు.
తెలుగులో ద్రోహి, లైలా మజ్నూ, దేవదాసు, ఆలీబాబా 40 దొంగలు, బడిపంతులు, అన్నాడీఎంకే తమ్ముడు వంటి సినిమాలలో ఆమె పాడిన పాటలు నేటికీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. మణిరత్నం దర్శకత్వంలో ‘నాయకుడు’ సినిమా కోసం ‘నా నవ్వే దీపావళి’ ఆమె చివరి పాట.
కె.జమునా రాణి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నేడు కలహళ్ళిలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.