అదే నువ్వు... అదే నేను... జూలై 31న

July 23, 2026


img

కాలేజీ ప్రేమ కథలు, హైస్కూల్, చివరికి ప్రైమరీ స్కూల్ ప్రేమ కథలు కూడా సినిమాలుగా వచ్చేస్తున్నాయి. మరి ఓ గెటడ్‌ కమ్యూనిటీలో ప్రేమలు పుట్టవా? వాటితో సినిమాలు చేయలేరా? అంటే చేయవచ్చని చెప్తున్నారు నిర్మాత గోవిందు కాండ్రేగుల.  

కొండల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘అదే నీవు... అదే నేను’ ఈ నెలాఖరున విడుదలకు సిద్దమవుతోంది. కమిటీ కుర్రోళ్ళు త్రినాధ్ శర్మ, యశ్వంత్ పెండ్యాల హీరోలుగా నటించగా, ‘సిద్ధార్థ్ రాయ్లో నటించి మెప్పించిన తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరోయిన్లుగా నటించారు. 

ఓ గెటడ్‌ కమ్యూనిటీలో రెండు జంటల రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఇదని, కనుక యువతని, ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుందని నిర్మాత గోవిందు కాండ్రేగుల చెప్పారు.


Related Post

సినిమా స‌మీక్ష