టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరో పాత్రలు చేసిన శివాజీ ఇప్పుడు క్యారక్టర్, విలన్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వంలో సుధీర్ ఆనంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘హైలెస్సో’ సినిమాలో శివాజీ విలన్ ‘లైలం బాబు’గా నటిస్తున్నారు. అయన ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య, రాజేంద్రన్, అక్షర గౌడ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాలో సుధీర్ ఆనంద్‌కి జోడీగా నటాషా సిర్, నక్ష శరన్ నటిస్తున్నారు. వజ్రవారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవి కిరణ్ కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి కెమెరా: సుజాతా సిద్దార్ద్, సంగీతం: అనుదీప్ దేవరకొండ చేస్తున్నారు.