అల్లరి నరేష్ పేరు వినగానే పెదవులపై ఓ చిన్న చిర్నవ్వు వస్తుంది. అది అతని గొప్పదనమే. కామెడీ హీరోగా అతను చేసిన సినిమాలే అందుకు కారణం.
అలాంటి అల్లరి నరేష్ ఇప్పుడు చంద్రమోహన్ దర్శకత్వంలో ‘రంభ, ఊర్వశి, మేనక’తో సినిమా అనగానే ఆ కామెడీ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు విడుదల చేశారు. సెప్టెంబర్ 4న రంభ, ఊర్వశి, మేనక’లతో కలిసి థియేటర్లకు వస్తున్నట్లు ప్రకటించేశారు కూడా.
ఈ సినిమాలో డా.కామాక్షి భాస్కర్, సాయి కుమార్, వివా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన కుమార్, గగన్ విహారీ, అనిష్ కురువిళ్ళ, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, ప్రసాద్ నిమ్మకాయల కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.