మంచు మనోజ్ కొత్త సినిమా: వడ్డీ కాసులవాడ

May 20, 2026


img

ఏడాదిన్నర క్రితం మంచు మనోజ్ పరిస్థితి వేరు. నేడు వేరు. అప్పుడు తండ్రి, అన్న విష్ణుతో కుటుంబ తగాదాలు, పోలీస్ స్టేషన్‌లో చివాట్లు, మీడియాలో వ్యంగ్య కథనాలు ఒకటా రెండా... చాలానే ఉన్నాయి. అవన్నీ అందరికీ తెలిసిన స్టోరీలే. కానీ వాటన్నిటి నుంచి ఒక్క మిరాయ్ సినిమాతో బయటపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ సక్సస్ ట్రాక్‌లో కొనసాగే ప్రయత్నంలో ‘డేవిడ్ రెడ్డి’ చేస్తున్నారు. 

నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ కొత్త సినిమా ‘వడ్డీ కాసులవాడ’ ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. దానిలో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మన హీరో వచ్చే పుట్టినరోజులోగా తన కష్టాలన్నీ తీర్చేస్తే వడ్డీతో సహా బాకీ తీర్చేస్తానంటూ ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారిని ప్రార్ధిస్తాడు. తనకు సాయపడితే అంటూ తిరుపతిలో కాలేజీ కట్టిస్తానంటూ తండ్రి మోహన్ బాబుపై సెటైర్ కూడా వేశారు. కానీ ఆ కామెడీ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. 


Related Post

సినిమా స‌మీక్ష