పెద్ది పహిల్వాన్ రికార్డుల మోత

May 19, 2026


img

రామ్‌ చరణ్‌ పెద్ది పహిల్వాన్‌గా నటించిన పెద్ది ట్రైలర్‌ సోమవారం ముంబాయిలో విడుదలైంది. కేవలం 24 గంటలలోనే 5 భాషల్లో కలిపి ఒక కోటి 10 లక్షల మంది పెద్ది ట్రైలర్‌ చూశారు. యూట్యూబ్‌లో ఇదొక సరికొత్త రికార్డుగా నిలుస్తోంది. అలాగే ఓవర్సీస్ ప్రీ-రిలీజ్ బుకింగ్స్ మొదలుపెట్టిన 24 గంటల్లోనే లక్ష టికెట్స్ బుక్ అయ్యాయి. ఇదీ ఓ సరికొత్త రికార్డు. పెద్ది పహిల్వాన్ కాస్త ఆలస్యంగా బరిలో దిగినప్పటికీ రికార్డుల మోత మొగిస్తున్నాడు. 

పెద్దిలో రామ్‌ చరణ్‌ గ్రామీణ క్రికెటర్ అని చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు తర్వాత అకస్మాత్తుగా ‘పెద్ది పహిల్వాన్’ పోస్టర్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ మారుమూల గ్రామ ప్రజల కోసం ఢిల్లీ వరకు వెళ్ళి పెద్ది చేసిన పోరాటమే ఈ సినిమా కథ అని ట్రైలర్‌తో స్పష్టత ఇచ్చారు. 

పెద్ది స్పెషల్ సాంగ్‌... ఈ నెల 23న భోపాల్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌, కోచ్‌ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్‌ నటించగా జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన పెద్ది జూన్ 4న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష