ప్యారడైజ్‌లో అంతా బాగానే ఉందట!

May 13, 2026


img

అంటే స్వర్గంలో కాదు... శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో అంతా సవ్యంగానే సాగుతోందని. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారని కనుక సినిమా రిలీజ్ ఇంకా ఆలస్యం కావచ్చంటూ సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. వాటిపై ఎస్ఎల్‌వీ సినిమాస్ స్పందిస్తూ, “‘ది ప్యారడైజ్’ ఇప్పటికే వంద రోజులు షూటింగ్‌ షెడ్యూల్ పూర్తయింది. దానిలో ఒక్క సన్నివేశం కూడా రీషూట్ చేయలేదు. అనుకున్న దానికన్నా సినిమా చాలా అద్భుతంగా సిద్ధం చేస్తున్నాము. రీషూట్ పుకార్లు ఎవరూ నమ్మవద్దు. ‘ది ప్యారడైజ్’ ముందు ప్రకటించినట్లు ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రిలీజ్‌ డేట్‌లో ఎటువంటి మార్పు లేదు,” అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 

ఈ సినిమాలో నానికి జోడీగా కయాడు లోహార్ నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు సుబ్బు... సుబ్బలక్ష్మి. 

ఈ సినిమాలో మోహన్ బాబు, రమ్యకృష్ణ, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.               

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష