నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న ‘రౌడీ జనార్ధన’ నుంచి ఓ పోస్టర్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ చేతిలో తుపాకీ పట్టుకొని కూర్చొని ఉండగా అయన గుండెలపై ఓ స్త్రీ పాదం మోపిన ఫోటో... ‘ప్రపంచంతో పోరాడుతాడు కానీ ప్రేమకు లొంగిపోతాడు’ అనే చక్కటి సందేశం రెండూ అద్భుతంగా ఉన్నాయి.
రౌడీ జనార్ధనలో విజయ్ దేవరకొండకు జంటగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవికిరణ్ కోలా, అడిషనల్ స్క్రీన్ ప్లే: జనార్ధన పసుమర్తి, సంగీతం: క్రిస్టో జేవియర్, కెమెరా: ఆనెంద్ సి చంద్రన్, స్టంట్స్:సుప్రీం సుండ, ఆర్ట్: సత్యనారాయణ డివై చేశారు.
ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు పాన్ ఇండియా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు తాజా పోస్టర్లో మరోసారి తెలిపారు.