సినీ పరిశ్రమలో ఒక్కో సమయంలో ఒక్కో రకం సినిమాలు వరుసగా తీస్తుంటారు. ప్రస్తుతం భూతప్రేతాలు, పీరియాడిక్ మూవీల ట్రెండ్ నడుస్తోంది. కనుక ఆ ట్రెండ్ ఫాలో అవుతూ ‘అగధ’ వస్తోందనుకోవచ్చు.
ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో సిద్దం చేస్తున్న ‘అగధ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ‘అగధ’ ఒక మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ అని చెప్పేశారు. నేడు విడుదల చేసిన టీజర్‌లో కూడా భూతప్రేతాలు, అతీంద్రియ శక్తుల సినిమాగానే చూపారు. ఈ జోనర్‌లో సినిమాలు ఇష్టపడేవారికి ‘అగధ’ టీజర్ బాగా నచ్చుతుంది.
‘అగధ’లో కామాక్షి భాస్కర్ల, శ్రావణ్ రెడ్డి, ఉల్క గుప్తా, జోవిక విజయ్ కుమార్, భాను చందర్, తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి సంగీతం: మిక్కిన్ అరుల్ దేవ్, కెమెరా: నాని చమిడిశెట్టి, ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ, అడిషనల్ స్క్రీన్ ప్లే: చైతన్య వేగి చేశారు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బలుసు కాశీ విశాలాక్షి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అగధ నిర్మించారు. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోందని టీజర్‌లో తెలిపారు.