నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్!

April 11, 2026


img

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌, రాశీఖన్నా, శ్రీలీల ప్రధాన పాత్రలలో నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చాలా భారీ అంచనాలతో గత నెల థియేటర్లలో విడుదలైంది. కానీ అంచనాలు అందుకోలేకపోయింది. ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. 

సేవాగుణం కలిగిన ఓ ఉపాధ్యాయుడు రాజకీయాలలోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పదవి చేపడతాడు. ఆయన ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు చేరదీసిన చిన్న పిల్లాడే ఉస్తాద్ భగత్ సింగ్. అతను ఏసీపీగా ముఖ్యమంత్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఆయన కుర్చీపై కన్నేసిన విలన్ని ఎదుర్కొంటాడు. ఇద్దరు హీరోయిన్లున్నారు కనుక మద్యలో వారితో ఆట పాట తప్పవు. క్లుప్తంగా ఇదే కథ. మిగిలింది నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తే సరిపోతుంది.             



Related Post

సినిమా స‌మీక్ష