మహేష్ బాబు-రాజమౌళి ఇలా కొట్టుకున్నారేమిటి?

February 25, 2026


img

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌ ‘వారణాశి’ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈలోగా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ ఓ వీడియో పోస్ట్ చేశారు. దానిలో రాజమౌళి-మహేష్ బాబు ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు.

వాళ్ళిద్దరూ ఏదో సీన్ కోసం రిహార్సల్ చేయడం లేదు. నిజంగానే కొట్టుకున్నారు. ‘సినిమా డెడ్’ అని రాంగోపాల్ వర్మ చిన్న హింట్ కూడా ఇచ్చారు. ఇద్దరూ గొడవపడటంతో ఆ సినిమా ఆగిపోయిందనుకున్నారు చాలా మంది. 

కానీ ఆయన వేరే ఉద్దేశ్యంతో ఈ వీడియో.. ఈ క్యాప్షన్ పెట్టారు. అదొక ఏఐ జనరేటడ్ వీడియో. వారిద్దరి ఫోటోలు, వీడియోలు ఏఐకి అందించి వారు కొట్టుకున్నట్లు ఓ ఫైట్ సీన్ క్రియేట్ చేసి ఇమ్మంటే ఇచ్చింది. అదే ఇది.

అందరూ నమ్మేసే అంత గొప్పగా ఏఐ వీడియోలు తయారుచేసి ఇచ్చేస్తుంటే మున్ముందు సినిమా చచ్చిపోకుండా ఉంటుందా? అని వర్మ అభిప్రాయం. నిజమే కదా?


Related Post

సినిమా స‌మీక్ష