మృత్యుంజయ్ టీజర్‌...

February 12, 2026


img

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతీ ఏడాది ఎక్కువ సినిమాలు చేస్తున్న అతికొద్ది మంది నటులలో శ్రీవిష్ణు కూడా ఒకరు. ఏడాదికి మూడు నాలుగు శ్రీవిష్ణు సినిమాలు చేస్తున్నారు. హీరోగానే చేయాలనే రూల్ ఏమీ పెట్టుకోకుండా అతిధి పాత్రలో కూడా కనిపించి అలరిస్తుంటారు. శ్రీవిష్ణు తాజా చిత్రం ‘మృత్యుంజయ్’ (మృత్యు ఎన్ జయ్ ) టీజర్‌ వరకు వచ్చేశారు. బుధవారం విడుదలైన టీజర్‌ అద్భుతంగా ఉంది. 

శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో శ్రీవిష్ణు, రెబ్బా మోనికా ప్రధాన పాత్రలు చేశారు. సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మరించి మాధవి ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శ్రీ హుస్సేన్ షా కిరణ్, సంగీతం:కాల భైరవ్, కెమెరా:విద్యా సాగర్ చింత, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేశారు. 

లైట్ బాక్స్ మేఎదియా, పిక్చర్ పెర్ఫెక్ట్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి కలిసి నిర్మించిన మృత్యుంజయ్ ఫిభ్రవరి 27న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష