తెలుగు, తమిళ్ ప్రజలను తన నటన, డాన్సింగ్, అందచందాలతో అలరిస్తున్న శ్రీలీల వైద్య విద్య పూర్తి చేసి ఎంబీబీఎస్ డిగ్రీ అందుకున్నారు. సినిమాలలో క్షణం తీరిక లేని జీవితం గడుపుతున్నా, పట్టుదలగా ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి డాక్టర్ అవడం చాలా అభినందనీయమే కదా!
స్నాతకోత్సవంలో ఆమె ఎంబీబీఎస్ డిగ్రీ అందుకుంటూ దిగిన ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఆమెకు అటు సినీ పరిశ్రమలో వారు, బంధుమిత్రులు, సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీలీల తల్లి గైనకాలజిస్ట్ కాగాఅన్నయ్య కూడా వైద్యుడే. కనుక ఆమె చిన్నతనం నుంచే వైద్య విద్యపై ఆసక్తి పెరిగింది. ఓసారి తమ ఊర్లో అమ్మమ్మ స్పృహ తప్పి పడిపోగా అన్నయ్య చికిత్స చేయగానే ఆమె కోలుకున్నారని, అప్పుడే తాను కూడా ఎంబీబీఎస్ చదివి వైద్యురాలిని అవ్వాలని నిశ్చయించుకున్నానని శ్రీలీల సోషల్ మీడియాలో అభిమానులకు తెలియజేశారు. అయితే మద్యలో సినీ పరిశ్రమలోకి వచ్చి పడటంతో చదువు కొనసాగించడం కాస్త కష్టమైందని కానీ అనుకున్న లక్ష్యం మరిచిపోలేదన్నారు.