భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ ‘స్వయంభూ’ టీజర్ నేడు విడుదలైంది. టీజర్‌లో ఫైట్స్, గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు మగధీర, బాహుబలి-1,2లో సన్నివేశాలను గుర్తుచేస్తాయి.
సినీ పరిశ్రమలో దర్శకులపై ఇతర సినిమాల ప్రభావం ఎంతో కొంత తప్పక ఉంటుంది. వారికి ప్రేరణ కలిగిస్తుంటాయి. కనుక ‘స్వయంభూ’ టీజర్‌లో కొన్ని సన్నివేశాలు ఆవిధంగా వచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ‘స్వయంభూ’ సినిమా టీజర్ చాలా అద్భుతంగా ఉంది.
ఈ సోషియో ఫాంటసీలో నిఖిల్ ఓ యోధుడుగా నటిస్తుంటే, నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, సుబ్బరాజు, సత్య తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: కెకె సెంథిల్ కుమార్, డైలాగ్స్: విజయ్ కామిశెట్టి, స్టంట్స్: కింగ్ సోలమన్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
టాగూర్ మధు, భువన్, శ్రీకర్ కలిసి పిక్సల్ స్టూడియోస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న స్వయంభూ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.