జన నాయకుడు వెనక్కి తగ్గక తప్పలే!

February 10, 2026


img

కోలీవుడ్‌ హీరో విజయ్‌ చివరి సినిమా జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో నేటికీ రిలీజ్ కాలేదు. దాని కోసం మద్రాస్ హైకోర్టు ధర్మాసనంలో వేసిన పిటిషన్‌ని కోర్టు అనుమతితో నేడు నిర్మాత ఉపసంహరించుకున్నారు.

అలాగే సెన్సార్ బోర్డు సూచించినట్లుగా సినిమాలో 20 నిమిషాలు నిడివిగల సన్నివేశాలను తొలగించేందుకు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. సినిమాకి సర్టిఫికేట్ జారీ చేసే విషయంపై నిర్మాత వెనక్కు తగ్గి సెన్సార్ రివిజన్ బోర్డు ఆదేశానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకోవడంతో త్వరలోనే సర్టిఫికేట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఒకవేళ వస్తే ఈ నెల 20న సినిమా రిలీజ్ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

ఇక విజయ్‌ ఈ సినిమాతో సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పేసి టివికే పార్టీతో తమిళనాడు శాసనసభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.


Related Post

సినిమా స‌మీక్ష