గాజులరామారంలో స్వల్ప భూకంపం!

February 10, 2026
img

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతమైన గాజులరామారం పరిధిలోని మెట్‌ఖాన్ గూడ వద్ద ఈరోజు మంగళవారం 10.10 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. అది భూకంపమని గుర్తించిన స్థానికులు, గెటడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ఆ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినిపించాయి. అవి భూమిలో నుంచి వచ్చిన శబ్దాలా లేక సమీపంలోని భవన నిర్మాణాల కోసం జరుపుతున్న గుట్టలలో బండ రాళ్ళని పేల్చుతున్నప్పుడు వచ్చిన శబ్దాలా తెలియక ప్రజలు ఆందోళన చెందారు. ఏది ఏమైనప్పటికీ ప్రకంపనల తీవ్రత చాలా తక్కువగా, కొన్ని సెకన్లపాటే ఉండటంతో ప్రజలకు ధైర్యం వచ్చింది. 

(Video Courtesy: Telugu Scribe)

Related Post