శనివారం నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలు చేస్తుండటంతో ఆ సంస్థ డైరెక్టర్ శిఖా గోయల్ మీడియా ముందుకు వచ్చి ఖండించక తప్పలేదు. ఆమె ఏమన్నారంటే, 2015నాటి ఏసీబీ కేసు (ఓటుకు నోటు)లో సాక్ష్యదారాలన్నిటినీ చాలా ఏళ్ళ క్రితమే కోర్టుకు అప్పగించాము.
అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు (ఫోన్ ట్యాపింగ్)లో 2024 వరకు సేకరించిన 131 సాక్ష్యాధారాలలో ఏడు తప్ప మిగిలినవన్నీ అప్పుడే కోర్టుకి అప్పగించేశాము. మిగిలినవి కూడా సురక్షితంగా ఉన్నాయి.
ఇటువంటి అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వివిధ కేసులకు సంబంధించి కీలకమైన సాక్ష్యాధారాలు నాశనం కాకుండా భద్రంగా ఉంచుతాము. కనుక నిన్న జరిగిన అగ్నిప్రమాదం గురించి తప్పుడు వార్తలు, దుష్ప్రచారం వద్దని అందరికీ కోరుతున్నాను,” అని శిఖా గోయల్ అన్నారు.