తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “మున్సిపల్ ఎన్నికలలో స్థానిక సమస్యలపై అందరూ మాట్లాడాలి. కానీ సిఎం రేవంత్ రెడ్డి, బిజేపి నేతలు, మా గుంటనక్క హరీష్ రావులతో సహా అందరూ ప్రజాసమస్యలు తప్ప మిగతా అన్నిటి గురించీ మాట్లాడారు.
ప్రచారంలో ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రచారం ముగియడంతో ఈ బూతుల వర్షం కూడా నిలిచిపోయి రాష్ట్రం ప్రశాంతంగా ఉందిప్పుడు.
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు, ఏడు కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కనుక ఆయా ప్రాంతాలలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయి? ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది?అని ప్రతిపక్షాలు నిలదీయాలి. కానీ బిజేపి, బీఆర్ఎస్ పార్టీలకు వాటిపై ఆసక్తి లేకపోవడంతో కాంగ్రెస్ మంత్రులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిపోయింది.
దాదాపు రాష్ట్రం మొత్తం ఎన్నికలు జరుగుతుంటే ఒక్క సిద్ధిపేటలో మాత్రమే అండర్ గ్రౌండ్ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎందుకంటే మా గుంటనక్కకు, గుంపుమేస్త్రీకి మద్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నందునే.
మా గుంటనక్క అధికారంలో ఉన్నా లేకపోయినా తన నియోజకవర్గానికి నిధులు సాధించుకోగలుగుతున్నారు. అదే ఆయన ప్రత్యేకత,” అని కల్వకుంట్ల కవిత ఆక్షేపించారు.
హరీష్ రావు, రేవంత్ కు ఉన్న సంబంధం ఇదే.. అందుకే సిద్దిపేటకు నిధులు | ABN Telugu
𝐊𝐚𝐯𝐢𝐭𝐡𝐚 Sensational Comments On Harish Rao , CM Revanth#kavitha #HarishRao #CMRevanthReddy #ABNTelugu pic.twitter.com/uQ7dO9qTFX