అతని నవ్వని వీడియో లేదు.. కానీ జీవితం దుర్భరం!

February 08, 2026
img

సోషల్ మీడియాలో రోజూ లక్షల కొద్దీ వీడియో క్లిప్స్ అప్‌లోడ్ అవుతుంటాయి. మన దేశంలో కూడా ప్రతీరోజూ అన్ని భాషలలో వేల సంఖ్యలో వీడియో క్లిప్స్ అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిలో అనేక కామెడీ క్లిప్స్ కూడా ఉంటాయి.

వాటి ముగింపులో ప్రముఖ నటుడు నానా పాటేకర్ లేదా ఓ కుర్రాడు టీ తాగుతూ పకపకమని నవ్వుతూ కనిపిస్తుంటారు. నానా పాటేకర్ పరిచయం అవసరం లేని వ్యక్తి. కానీ ఆ కుర్రాడు ఎవరు? అంటే చాలా మందికి తెలియదు.

కానీ అతని నవ్వుని అందరూ ఇష్టపడుతున్నారు. కనుక కామెడీ వీడియోలలో అతనిని తప్పకుండా జోడిస్తారు. 

ఆ కుర్రాడి పేరు అరుణ్. అతని స్వస్థలం తెలంగాణలో భూపాలపల్లి జిల్లా మాలపల్లి గ్రామం. నిరుపేద కుటుంబానికి చెందిన అరుణ్ 4వ తరగతితోనే చదువు మానేసి లారీ క్లీనరుగా చేరాడు. 

ఓసారి రోడ్డు పక్కన హోటల్ వద్ద నిలబడి టీ తాగుతున్నప్పుడు, డ్రైవర్ నెహ్రూ ఏదో జోక్ చెప్పాడు. ఆ జోక్ విని అరుణ్ నవ్వుతున్నప్పుడు డ్రైవర్ నెహ్రూ తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఆ జోక్ ఏమిటో తెలీదు కానీ అరుణ్ నవ్వు యూట్యూబర్స్ కి బాగా నచ్చేసింది. అప్పటి నుంచి తమ కామెడీ వీడియో క్లిప్స్ లో దానిని తెగ వాడేసుకుంటున్నారు. 

అలా తనకు తెలియకుండా పాపులర్ అయిపోయిన అరుణ్, ఎక్కడున్నాడో వెతుక్కుంటూ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులు, యూట్యూబర్స్ వచ్చి ఇంటర్వ్యూలు చేశారు. దాంతో అతనూ ఇంకా పాపులర్ అయ్యాడు. 

కనుక డ్రైవర్ నెహ్రూ సలహాతో క్లీనర్ ఉద్యోగం మానేసి అయన ప్రోత్సాహంతో 10వ తరగతి పరీక్షలు వ్రాసి పాస్ అయ్యాడు. సోషల్ మీడియాలో తన సొంత అకౌంట్ తెరిచి స్వయంగా కామెడీ వీడియోలు చేస్తూ ఇంకా పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకుంటున్నాడు.

Related Post