అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ ఏమన్నారంటే..

February 08, 2026


img

శనివారం ఉదయం నాంపల్లి వద్ద గల ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంపై ఆ సంస్థ డైరెక్టర్ శిఖా గోయల్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

నిన్న ఉదయం 10.08 గంటలకు మొదటి అంతస్తులో పొగని గమనించిన ఓ ఉద్యోగి వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది అందరూ కలిసి మంటలు ఆర్పుతుండగా స్మోక్ అలారం యాక్టివ్ అయ్యింది. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది ఫైట్ ఇంజన్లతో వచ్చి మంటలను ఆర్పి వేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మంటలు పూర్తిగా ఆర్పివేశారు.

ఈ అగ్నిప్రమాదంతో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ట్రెనింగ్ హాలుకు స్వల్పంగా నష్టం జరిగింది. కానీ వివిధ కేసులకు సంబంధించి ఫైల్స్, ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని పరికరాలు అన్నీ భద్రంగానే ఉన్నాయి.

ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై మేము పోలీసులకు పిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.      

ఈ అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందిస్తూ, ఓటుకు నోటు కేసు తాలూకు సాక్ష్యాధారాలను తుడిచిపెట్టేయడానికే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లుందని ట్వీట్ చేశారు.

కేటీఆర్‌ దీనిపై రాజకీయాలు మొదలుపెట్టడంతో ప్రజలలో అపోహలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ శిఖా గోయల్ఈ అధికారిక ప్రకటన చేయాల్సి వచ్చింది.


Related Post