భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ ‘స్వయంభూ’ ఈ నెల 13న విడుదల కావాల్సి ఉండగా సీజీ వర్క్స్ ఆలస్యం అవడంతో ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా పడింది. కనుక సినిమా రిలీజ్ కావాల్సిన సమయానికి టీజర్‌తో సరిపెడుతున్నారు. ఈ నెల 11 ‘స్వయంభూ’ టీజర్ విడుదల కాబోతోంది.
ఈ సోషియో ఫాంటసీలో నిఖిల్ ఓ యోధుడుగా నటిస్తుంటే, నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, డైలాగ్స్: వాసుదేవ్ మున్నెప్పగారి చేస్తున్నారు.
టాగూర్ మధు, భువన్, శ్రీకర్ కలిసి పిక్సల్ స్టూడియోస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న స్వయంభూ విదేశీ హక్కులను ఫరాస్ ఫిల్మ్ సంస్థ రూ.7 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం.