మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో ఏర్పాటు చేసిన 828 హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం హనుమకొండలోని టిటిడీ కళ్యాణ మండపంలో 5 రోజులుగా సాగుతోంది. సోమవారం వరకు జరిగిన లెక్కింపులో మొత్తం రూ11.83 కోట్లు నగదు రూపంలో ఆదాయం వచ్చింది.
హుండీలలో నగదుతో పాటు వెండి బంగారు ఆభరణాలు కూడా కానుకలుగా వచ్చాయి. వాటిని వేరు చేసి బరువు తూచి ఆ వివరాలు రికార్డులో నమోదు చేస్తున్నారు. కొందరు భక్తులు తమ ప్రేమ ఫలించాలంటూ వ్రాసిన లేఖలు, తమ ఆస్తి వివాదాలు పరిష్కరించాలంటూ వనదేవతలకు వినతి పత్రాలు హుండీలలో వేశారు.
మిగిలిన హుండీల ఆదాయం లెక్కించడానికి మరో రెండు రోజులు పట్టవచ్చని పర్యవేక్షణ ప్రత్యేకాధికారి కృష్ణ ప్రసాద్ చెప్పారు.