ప్రేమికుల దినోత్సవంనాడు పెద్ది గిఫ్ట్.. ఏమిటో?

February 08, 2026


img

బుచ్చిబాబు- రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ మార్చి 27న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కనుక ఇక ప్రమోషన్స్ స్పీడ్ పెంచాల్సిన సమయం వచ్చేసింది. ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవంనాడు పెద్ది నుంచి అభిమానులుకు ఓ పెద్ద గిఫ్ట్ ఉండబోతోందని సమాచారం. అది పెద్ది-అచ్చియమ్మ (జాన్వీ కపూర్)ల రొమాంటిక్ సాంగ్ కావచ్చు. మరో మూడు నాలుగు రోజులలో సాంగ్ ప్రమో వెలువడే అవకాశం ఉంది.   

ఈ సినిమాలో గ్రామీణ క్రికెటర్ పెద్దిగా నటిస్తున్న రామ్ చరణ్‌కు కోచ్ గౌరు నాయుడుగా ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్ కుమార్‌, విలన్ అప్పల సూరిగా జగపతి బాబు, క్రికెట్ బోర్డు చైర్మన్‌ లేదా సభ్యుడిగా బాలీవుడ్‌ నటుడు బొమ్మన్ ఇరానీ నటిస్తున్నారు.

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్న  పెద్ది 2026, మార్చి 27న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష