పని ఒత్తిడి డిప్రషన్‌తో విజయారెడ్డి ఆత్మహత్య!

February 07, 2026
img

వారం రోజుల క్రితం చర్లపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో విజయారెడ్డి అనే ఓ మహిళ, తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన జరిగి అప్పుడే వారం రోజులవుతున్నా దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆమె పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చెప్పలేకపోతున్నారు. 

ఆమె ఆత్మహత్య చేసుకోబోయే ముందు చివరిగా తన సోదరుడు చిరంజీవితో ఫోన్లో మాట్లాడారు. అప్పుడు కూడా ఆమె ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పలేదు. రోజూలాగే కాసేపు మామూలుగా మాట్లాడి ఫోన్ పెట్టేశారు. కనుక ఆయనకీ అనుమానం కలగలేదు. 

దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కధనాలు పుట్టుకొస్తుండటంతో ఈరోజు అయన మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కానీ కోర్టులో పిటిషన్‌ వేసి న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారని చిరంజీవి చెప్పారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “మా చెల్లి విజయారెడ్డి, ఇద్దరు పిల్లల మృతితో మేం అందరం చాలా శోకంలో ఉన్నాము. ఈలోగా ఆమె గురించి సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల కధనాలు చూసి మాకు ఇంకా బాధ కలుగుతోంది. 

వాస్తవం ఏమిటంటే, మా చెల్లి విజయారెడ్డి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో 14 మందికి టీమ్‌ లీడరుగా పనిచేస్తున్నారు. ఆ కారణంగా ఆమె పని ఒత్తిడి చాలా విపరీతంగా ఉంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక అప్పుడప్పుడు చాలా ‘డిప్రెషన్’లో ఉంటుంది. బహుశః ఆ డిప్రెషన్‌తోనే ఇలాంటి అనూహ్యమైన నిర్ణయం తీసుకొని ఉంటుంది. 

వారి మరణంపై మాకు ఎటువంటి అనుమానాలు లేవు. కనుక దయచేసి సోషల్ మీడియాలో వారి గురించి పుకార్లు, తప్పుడు కధనాలు ప్రచురించవద్దు,” అని చిరంజీవి అందరికీ విజ్ఞప్తి చేశారు.

Related Post