చిరంజీవి-బాబీ కొల్లి కాంబినేషన్‌లో తీయబోతున్న సినిమాకి సంబంధించి అప్‌డేట్ వచ్చింది. సినిమా స్క్రిప్ట్ సిద్ధం అయ్యింది. ఈ నెలాఖరుకల్లా ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తవుతాయి. కనుక వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
ఇది తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ సినిమా అని తెలుస్తోంది. చిరంజీవి కూతురుగా సారా ఆర్జున్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇది తండ్రీ కూతుర్లు కధ అయినప్పటికీ ఈ సినిమాలో చిరంజీవికి ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఓ సీనియర్ హీరోయిన్ పేరు ఖరారు చేసి రెండో హీరోయిన్ కోసం పలువురి పేర్లు పరిశీలిస్తున్నారు
మార్చిలో మొదలుపెట్టి జూలై నెలాఖరులోగా షూటింగ్ పూర్తిచేసి దసరా, దీపావళికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ, లోహిత్ కలిసి నిర్మించబోతున్నారు.