తెలంగాణ సిఎం నేనా, రేవంత్ రెడ్డా? కిషన్ రెడ్డి ప్రశ్న

February 08, 2026


img

మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలలో సిఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావుల అవినీతి కేసులపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ చేత విచారణ జరిపించి, అరెస్ట్ చేయించడం లేదని ఆరోపిస్తున్నారు.

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించమని కేంద్రానికి లేఖ వ్రాసి ఆరు నెలలవుతున్నా పట్టించుకోలేదన్నారు. బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీలది ఫెవికాల్ బంధం అని ఎద్దేవా చేశారు. బిజేపి ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వారిని కాపాడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 

ఈ ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ, “రేవంత్ రెడ్డిని నేరుగా ఒక మాట అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరా లేక నేనా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీదా నాదా?

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావులపై చర్యలు తీసుకోకుండా మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు? వాళ్ళపై చర్యలు తీసుకోకుండా మిమ్మలని ఎవరు అడ్డుకుంటున్నారు? మీరే చెప్పాలి. మకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతికి పాల్పడినవారిపై తక్షణం చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు.


Related Post