సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని... ట్రైలర్‌!

February 07, 2026


img

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని... శివాజీ, లయ ప్రధాన పాత్రలు చేసిన క్రైం కామెడీ సినిమా పేరిది. ఈ సినిమా ఫిభ్రవరి 12న నేరుగా ఈటీవి విన్ ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ఓటీటీలోకి విడుదలవుతున్నప్పటికీ, షరా మామూలుగా నేడు ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్‌లో కామెడీ అదిరిపోయింది.

ఈ సినిమాలో శివాజీ, లయ భార్య భర్తలుగా వారి కుమారుడుగా రోహన్ రాయ్ నటించారు. ఇంకా ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మానుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకు కధ దర్శకత్వం: సుదీర్ శ్రీరాం, సంగీతం:రంజిన్ రాజ్,  కెమెరా:రిత్విక్ రెడ్డి, ధీరజ్ పి, ఎడిటింగ్: బాలు మనోజ్ చేశారు. శ్రీశివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ స్వయంగా నిర్మించి ప్రధాన పాత్ర చేశారు.

Trailer Link: https://youtu.be/8rgXwgSFkHE?si=MqqgWQfliyTfutot 


Related Post

సినిమా స‌మీక్ష