ది ప్యారడైజ్: మొదటి పాట 24న

February 07, 2026


img

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్‌ శంషాబాద్ వద్ద ప్రత్యేకంగా సెట్స్ వేసి కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ జరుగుతుంది.

ఈ నెల 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తొలి పాట విడుదల చేయబోతున్నారు. అది ఈ సినిమాలో నాని ఇంట్రడక్షన్ సాంగ్ అని సమాచారం. ఈ సినిమాలో నానికి జోడీగా కయాదు లోహార్ నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.               

“చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించే రాసిన్రు.. గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కధ. జమానా జమాన కెళ్ళి నడిచే శవాల కధ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కధ..” అంటూ ఈ సినిమా కధని మొదటే టూకీగా చెప్పేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.   

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. 

మద్యలో కొన్ని రోజులు షూటింగ్ నిలిచిపోవడంతో మార్చి 26న విడుదల కావలసిన ఈ సినిమా ఈ వేసవి సీజన్‌కి వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. 


Related Post

సినిమా స‌మీక్ష