మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా చేసిన ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదలై హిట్ కొట్టింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో సినిమా చూడలేకపోయినవారు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూసి ఆనందించవచ్చు.
ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: జే.యువరాజ్ చేశారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ‘అనగనగా ఒక రాజు’ వేషంలో నవీన్ పోలిశెట్టిని మన ముందుకు తెచ్చి నవ్వించారు.
క్లుప్తంగా కదేమిటంటే, ఊర్లో జమీందార్ కొడుకు అనే ముద్ర తప్ప చేతిలో చిల్లిగవ్వ లేని హీరో బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే జీవితంలో సెటిల్ అయిపోవచ్చునుకుంటాడు. అలా ధనిక కుటుంబానికి చెందిన హీరోయిన్ (మీనాక్షి చౌదరి)ని బుట్టలో పడేస్తాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందనేది ఓటీటీలో చూడాల్సిందే!