విశాఖ యువకుడు కళ్ళలో టాటూలు!

February 06, 2026
img

‘పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది. ఆ రోకలి తలకు చుట్టండి... ’ అన్నట్లు ఉంది కొందరు యువత తీరు. ఒకరు వేగంగా దూసుకు వస్తున్న రైలుకి ఎదురుగా పట్టాల మద్య కూర్చొని అది దగ్గరకు వచ్చేసరికి బోర్లా పడుకొని రీల్స్ చేస్తారు. మరొకరు కొండ చరియ అంచున నిలబడి రీల్స్ చేసి ప్రాణాలు పోగొట్టుకుంటారు.

 ప్రతీ మనిషి గుర్తింపు కోరుకోవడం సహజమే. కానీ ఆ గుర్తింపు చదువు, జ్ఞానం, తెలివితేటలు, వ్యక్తిత్వం, కళలు, క్రీడలు, సాహిత్యం లేదా మరేదైనా ఓ గొప్ప పని చేసి పొందాలి. కానీ మన డ్రెస్సులు, అందం, ఫోటోలు, వీడియోలు (రీల్స్) వంటివాటితో లైక్స్, షేర్లుతో వచ్చే గుర్తింపు కోసం ఆరాటపడేవారే ఎక్కువ మంది ఉన్నారు. 

ఇంతకీ విషయం ఏమిటంటే, విశాఖలో టాటూ డిజైనర్‌గా చేస్తున్న జగదీష్ అనే ఓ యువకుడు ఏకంగా తన రెండు కళ్ళపై టాటూలు వేయించుకున్నాడు. దాంతో అతని చూపు పోయిందంటూ ఈనాడులో వార్త వచ్చింది.

దానిపై అతను స్పందిస్తూ “టాటూలపై మక్కువతోనే నేను విశాఖలో టాటూ షాప్ పెట్టాను. గిన్నిస్ బుక్ రికార్డు కోసమే కళ్ళలో టాటూ వేయించుకున్నాను. కానీ టాటూలతో నా కంటి చూపు పోలేదు. కళ్ళ పరీక్ష కూడా చేయించుకున్నాను. కళ్ళు బాగానే ఉన్నాయని, ఎలాంటి సమస్య లేదని కంటి వైద్యులు చెప్పారు,” అని జగదీష్ చెప్పాడు. 

జగదీష్ అదృష్టం కొద్దీ అతనికి కంటి చూపు పోలేదు. కానీ టాటూలు వేయించుకున్నప్పుడు రెండు కళ్ళు పోతే?తన  పరిస్థితి, భవిష్యత్‌ ఏమిటి?

Related Post