విశ్వక్‌ సేన్‌ ఫంకీ నుంచి మరో పాట… ప్రమో

February 06, 2026


img

అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ చేస్తున్న ‘ఫంకీ’ నుంచి ఇటీవలే ‘రట్టాటటాచ్..’ అంటూ హుషారుగా సాగే పాట విడుదలైంది. ఇప్పుడు యమ యమ్మా అంటూ సాగే మూడో పాట ప్రమో విడుదలైంది. త్వరలో పూర్తి పాట విడుదలవుతుంది.     

ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌కు జోడీగా కాయడు లోహర్‌ నటించింది. నరేష్, విటివి గణేశ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనుదీప్, సంగీతం: భీమ్స్  సీసీరిలియో, కెమెరా: సురేష్ సంగం, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

 శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ నెల 13న ఫంకీ విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష