తరుణ్ భాస్కర్ మరో సినిమా... రేపు ప్రకటన

February 06, 2026


img

ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు, నటుడు ‘ఓం శాంతి శాంతి శాంతి’తో వచ్చి హిట్ కొట్టారు. అది ఇంకా థియేటర్లలో ఉండగానే తన తర్వాత సినిమా గురించి ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. దానిలో గాయపడిన సింహం బొమ్మ చూపుతూ శనివారం సాయంత్రం 4 గంటలకు సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 

ఈ సినిమాలో చిట్టి ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించబోతోంది. ఒకప్పుడు వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన జేడీ చక్రవర్త ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు రేపు సాయంత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు తెలియజేసే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష