కొత్త సినిమాకు నటీనటులు కావలెను: మనోహర్ చిమ్మని

January 16, 2026


img

ప్రముఖ సినీ రచయిత మనోహర్ చిమ్మని తాము తీయబోతున్న కొత్త (తెలుగు) సినిమాకు కొత్త నటీనటులు కావాలని సోషల్ మీడియాలో ఓ ప్రకటన పోస్ట్ చేశారు. 18 నుంచి 28 ఏళ్ళలోపు వయసున్న నటీనటులు హీరో, హీరోయిన్, వారి సపోర్టింగ్ పాత్రలకు నటీనటులు కావాలని తెలిపారు.

సినిమాలో నటించాలని ఆసక్తి, అభిరుచి కలిగిన యువతీ యువకులు తమ పూర్తి బయోడేటా, ఓ తాజా సెల్ఫీ ఫోటోతో richmonkmail@gmail.com లేదా వాట్సప్ నంబర్: 99895 78125కు పంపించాలని కోరారు. అలాగే తమ గురించి పరిచయం చేసుకుంటూ రెండు నిమిషాల నిడివి గల వీడియోని కూడా పంపించాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు వివరాలు పంపించవచ్చు కానీ ఫోన్లు చేయవద్దని మనోహర్ చిమ్మని విజ్ఞప్తి చేశారు. 

సినీ పరిశ్రమలో ప్రవేశం లభించడమే చాలా కష్టం. కానీ మనోహర్ చిమ్మని సినిమాలో నటించే అవకాశం కల్పిస్తామని చెపుతున్నారు. మరెందుకు ఆలస్యం? సినిమాలలో నటించాలని కోరిక, మీలో నటించే నేర్పు ఉంటే, వెంటనే ఆయన కోరిన వివరాలు ఈ మెయిల్లో పంపించేయండి  


Related Post

సినిమా స‌మీక్ష