సంక్రాంతి సినిమాల ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్‌లో అందరూ అన్ని సినిమాలు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నామని చెప్తుంటారు. కానీ వాస్తవానికి అందుకు భిన్నంగా జరుగుతుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒకరాజు సినిమా సంక్రాంతికి విడుదలై హిట్ కొట్టింది.
అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ సినిమా నిర్మాత నాగ వంశీ వ్యంగ్యంగా స్పందిస్తూ, “గత 72 గంటల నుంచి సోషల్ మీడియాలో మా ఫ్యాన్ బాయ్స్ అందరూ ఎంతో కష్టపడి డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళందరూ నా ఫ్యాన్స్ బాయ్స్ కారు. ఎవరి కోసం పనిచేస్తున్నారో మాకు బాగా తెలుసు.
కానీ వాళ్ళు కష్టపడి డ్యూటీ చేస్తునందున మా సినిమాకి కలెక్షన్ బాగా పెరిగాయి. మరో వారం పది రోజులు ఇలాగే వాళ్ళు డ్యూటీ చేస్తే మంచి కలెక్షన్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళందరికీ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. త్వరలోనే అది ప్రకటిస్తాను,” అని అన్నారు.
ఒక హీరోపై అభిమానం ఉండటం మంచిదే. కానీ తమ హీరో సినిమాకి పోటీగా వచ్చాడనో లేదా తమ హీరో సినిమా బాగా ఆడలేదనో అసూయతో వేరే హీరో సినిమాని దెబ్బ తీయాలనుకోవడమే చాలా తప్పు. ఇలాంటి చెడు పద్దతులను ఆయా హీరోలే అడ్డుకట్ట వేయాలి. లేకుంటే వారి సినిమాలకు కూడా మరొకరు ఇలాగే దుష్ప్రచారం చేస్తారు.
72 గంటల నుండి ఫ్యాన్ బాయ్స్ అంతా గట్టిగా డ్యూటీ చేస్తున్నారు
— Filmy Focus (@FilmyFocus) January 16, 2026
నా ఫ్యాన్స్ బాయ్స్ కాదు.. ఎవరి ఫ్యాన్ బాయ్స్ అనేది అందరికీ తెలుసు
మీరంతా మరో 10 రోజులు ఇలానే డ్యూటీ చేయండి.. మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అనేది త్వరలోనే అనౌన్స్ చేస్తాను: #NagaVamsi pic.twitter.com/OHOlJsor3N