విజయ్ సేతుపతి-పూరీ సినిమా టైటిల్‌: స్లమ్‌డాగ్‌

January 16, 2026


img

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర చేస్తున్న సినిమాకి టైటిల్‌ ‘స్లమ్‌ డాగ్’-33 టెంపుల్ రోడ్’ అని ప్రకటిస్తూ నేడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. ముందు అనుకున్నట్లుగానే ఈ సినిమాలో విజయ్ సేతుపతి బిచ్చగాడిగా నటిస్తున్నారు. 

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చుట్టూ నోట్ల కట్టలతో నిండిన ఓ గదిలో నల్లటి గ్లాసస్ పెట్టుకొని చేతిలో రక్తం కారుతున్న కత్తితో చూపారు. మురికివాడల నుంచి మొదలైన ఈ తుఫానుని ఎవరూ ఆపలేరని విజయ్‌ సేతుపతి పాత్ర గురించి చిన్న బ్రీఫింగ్ ఇచ్చారు. 

పూరీ, ఛార్మీలు తమ సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తీస్తున్న ఈ సినిమాలో  విజయ్ సేతుపతి, విజయ్‌ కుమార్‌, టబు, రాధిక ఆప్టే, సంయుక్త, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా పాటలు, టీజర్‌, ట్రైలర్‌ వరుసగా విడుదల కాబోతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.   


Related Post

సినిమా స‌మీక్ష