సింగర్ సునీత కుమారుడు ఆకాష్ కొత్త మలుపు

January 16, 2026


img

ప్రముఖ నేపధ్య గాయని సునీత కుమారుడు ఆకాష్ ‘సర్కార్ నౌకరి’తో హీరోగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. అప్పుడే రెండో సినిమా పూర్తి చేసేశాడు. ఆకాష్, భైరవి ఆర్గ్యా బావమరదళ్ళుగా నటిస్తున్న ఈ సినిమాకు ‘కొత్త మలుపు’ అని పేరు ఖరారు చేశారు. గ్రామీణ నేపధ్యంలో సాగే చక్కటి రొమాంటిక్-కామెడీ సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. నిన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేస్తూ ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయిందని త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. 

కే.శివ వరప్రసాద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో రఘుబాబు, పృధ్వీ, ప్రభావతి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష