అల్లు అర్జున్‌-లోకేష్ కనగరాజ్ సినిమా ప్రకటన చూశారా?

January 14, 2026


img

పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్‌ కోలీవుడ్‌ దర్శకుడు అట్లీతో ఓ సినిమా (#ఏఏ22) మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కోలీవుడ్‌ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా (#ఏఏ23)కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు. సంక్రాంతికి ఏఏ22 అప్‌డేట్‌ వస్తుందో లేదో తెలీదు కానీ నేడు ఏఏ22 అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ యానిమేషన్ వీడియో పోస్ట్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. 

నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు  బన్నీవాస్, నట్టి, శాండీ, స్వాతి సహా నిర్మాతలు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్‌ సంగీతం అందించబోతున్నారు. ఈ ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. త్వరలో ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/6hqduA_fUqE?si=w2RM95Gxdup_hbFf" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>  


Related Post

సినిమా స‌మీక్ష